Telangana government has released 750 crore interest free loans to women on the occasion of Women's Day
mictv telugu

తెలంగాణ ఆడబిడ్డలకు ఉమెన్స్ డే గిఫ్ట్…వడ్డీలేని రుణాల నిధులు విడుదల చేసిన సర్కార్..!

March 7, 2023

Telangana government has released 750 crore interest free loans to women on the occasion of Women's Day

ఉమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలకు కానుక అందించనుంది. రూ. 750కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు నిధులను తెలంగాణ సర్కార్ విడుదల చేయనుంది. మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెద్దెత్తున వడ్డీలేని రుణాలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు 250కోట్ల రూపాయాలను పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో ఉన్న పురపాలక పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఈ నిధులను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

కాగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న వడ్డీ లేని రుణాల బకాయిలను మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రిలీజ్ చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలన్నీ కూడా అత్యంత ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని…తిరిగి చెల్లిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ విషక్ష్ంలోనూ దేశంలోనే మన మహిళలు అగ్రస్థానంలో నిలిచారన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం రోజున వంద మహిళా ఆసుపత్రులను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి మంగళవారం మహిళ సమస్యల మీద మహిళా డాక్టర్లు వైద్యం అందిస్తారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో లక్షా 77వేలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని…అందులో దాదాపు 18లక్షల మంది సభ్యులు కొనసాగుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వీరందరికీ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ లేని రుణాలు నిధులు ఎంతో సహాయకరంగా ఉంటాయన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు సుమారు 15,895కోట్ల రూపాయల రుణాలను లింకేజీ రూపంలో అందించినట్లు వెల్లడించారు. ఇంతటి భారీ రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రూపొందించిన వడ్డీలేని రుణాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 370కోట్ల రూపాయలన, 90325 స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు కేటీఆర్ తెలిపారు. మహిళా సంఘాల తరపును ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.