Telangana government increased security for Tandoor MLA Rohit Reddy
mictv telugu

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భద్రతపై హోం శాఖ కీలక నిర్ణయం

October 29, 2022

Telangana government increased security for Tandoor MLA Rohit Reddy

తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు, మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు భద్రతను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2 ప్లస్ 2 భద్రత ఉండగా, దానిని 4 ప్లస్ 4 కి పెంచింది. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి బీజేపీకి సన్నిహితులుగా చెప్తున్న నిందితులను పట్టుకున్నారు. రోహిత్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం నిందితులతో రోహిత్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్స్ లీకయ్యి కలకలం రేపింది. ఈ క్రమంలో ఆయనకు ఎలాంటి హాని కలుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతను పెంచారు. అటు ఈ ఘటన జరిగినప్పటి నుంచి రోహిత్ రెడ్డి బయటకు రాకపోవడం గమనార్హం.