మీరు తిన్నాకే పిల్లలకు పెట్టండి.. ప్రభుత్వం ఉత్తర్వులు - MicTv.in - Telugu News
mictv telugu

మీరు తిన్నాకే పిల్లలకు పెట్టండి.. ప్రభుత్వం ఉత్తర్వులు

June 14, 2022

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అమలు చేస్తున్న మధ్యాహ్న బోజనం కార్యక్రమంలో భాగంగా ముందుగా స్కూలు ప్రధానోపాధ్యాయులు రుచి చూసాకే విద్యార్దులకు పెట్టాలని ఆదేశించింది. ప్రతీ పాఠశాలలో మధ్యాహ్న భోజన మెనూని గోడలపై రాయాలని, వారానికి మూడు గుడ్లు పెట్టాలని ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. వేడిగా ఉన్న ఆహారాన్నే అందించాలని, పథకం అమలు కోసం తల్లిదండ్రులతో ప్రత్యేక కమిటీలు వేయాలని అందులో పేర్కొంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పటివరకు ఉన్న గుడ్డు ధరను రూ. 4 నుంచి రూ. 5కు పెంచుతున్నట్టు ప్రకటించింది. నాణ్యమైన భోజనంతో పాటు మంచి నీరు కలుషితం కాకుండా చూడాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి వాకాటి అరుణ స్పష్టం చేశారు.