తెలంగాణ ప్రభుత్వం వరసబెట్టి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. గురువారం గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటొఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం శుక్రవారం ఏకంగా 6 వేలకు పైగా పోస్టులకు టీఎస్పీఎస్సీ నుంచి ప్రకటన విడుదల చేయించింది. స్టాఫ్ నర్సు పోస్టులకు, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి వీటిని వెలువరించింది. నర్సుల పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపడతారు. 5,204 పోస్టులు భర్తీ చేస్తారు. జనవరి 25 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఫిబ్రవరి 15. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేస్తారు. వైద్య విధాన పరిషత్తులో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎంఈ, డీహెచ్ – 3,823, వైద్య విధాన పరిషత్ – 757, ఎంఎన్ఎ కేన్సర్ హాస్పిటల్ – 81, డిజబుల్డ్, సినీయర్ సిటిజెన్స్ వేల్ఫేర్ – 8, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్స్ – 127, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 197, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 74, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ – 124, తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ – 13 ఉద్యోగాలు ఉన్నాయి.
గ్రూప్ 3 నోటిఫికేషన్..
గ్రూప్ 3లో 1365 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23వరకు దరఖాస్తులును ఆన్లైన్లో స్వీకరిస్తారు. వ్యవసాయ, ఆర్థిక శాఖలు, విద్యాశాఖ, పరిశ్రమల శాఖలు వంటి పలు శాఖల్లో నియామకాలు ఉంటాయి.