Home > Featured > బార్లు, పబ్‌లలో ఉన్న బీర్లను వైన్స్‌కు తరలించండి..అబ్కారీ శాఖ

బార్లు, పబ్‌లలో ఉన్న బీర్లను వైన్స్‌కు తరలించండి..అబ్కారీ శాఖ

beeeru

దాదాపు 45 రోజులు మద్యానికి దూరమై మందుబాబులందరూ గొప్ప కరోనా త్యాగం చేసినంత పనే చేశారు. మద్యం షాపులు తెరుచుకోవడంతో ఆవురావురుమంటూ మందుకు పరుగులు పెడుతున్నారు. ఇన్ని రోజుల లాస్‌ను ఇప్పుడు భర్తీ చేసే పనిలో ఉన్నట్టున్నారు. అందుకే ఇప్పుడు క్వాటర్, ఫుల్లు కాకుండా కాటన్లకు కాటన్లే తీసుకెళ్తున్నారు. ఇంట్లో సరుకులు అడ్వాన్స్‌డ్‌గా.. మందును కూడా తీసుకెళ్లి ఇంట్లో స్టాక్ చేసుకుంటున్నారు. మళ్లీ మద్యం బంద్ చేసి తమ మందు ఆర్తి మీద దెబ్బ కొట్టొచ్చని మందుబాబులందరూ మేలుకున్నారు. మద్యాన్ని వీర లెవల్లో కొనేస్తున్నారు. భౌతిక దూరాలు పాటించకుండా ఎగబడుతున్నారు. దీంతో వైన్స్ షాపుల్లో ఉన్న స్టాక్ తగ్గుముఖం పట్టింది. అలాగే బార్లు, పబ్ లలో ఉన్న బీర్లు ఎక్స్పైరీ కావస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, పబ్ లలో ఉన్న బీర్లను వైన్స్ షాపులకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17వ తేది నుంచి 31 వతేది మే వరకు ఎక్స్పైరీ కానున్న బీర్లను వైన్ షాప్ లకు సప్లై చేయాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ. పెరిగిన ధరల ప్రకారమే ఈ బీర్లను సప్లె చేయాలనీ ఉత్తర్వుల్లో తెలిపింది. రేపు ఉదయం లోగా తరలించాలని తెలిపింది.

Updated : 15 May 2020 8:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top