9వ తరగతి వరకు పరీక్షలు లేవు.. ఉత్తర్వులు జారీ  - MicTv.in - Telugu News
mictv telugu

9వ తరగతి వరకు పరీక్షలు లేవు.. ఉత్తర్వులు జారీ 

May 5, 2020

Telangana government no examination for school students .

కరోనా లాక్‌డౌన్ పెద్దాళ్లను ఏడిపిస్తున్నా పిల్లలకు మాత్రం పరీక్షల బాధ తప్పించింది. 1 నుంచి 9వ వరకు పరీక్షల నిర్వహించకూడదని, అందర్నీ పాస్ అయినట్లు ప్రకటించిన నేరుగా పై తరగతులకు పంపాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. ఈమేరకు మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వ పాఠశాలలతోపాటు  ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలందరూ ఉత్తీర్ణులైపోయారు. 2019-20 విద్యాసంవత్సరంలో ఉన్న వీందర్నీ2020-21 సంవత్సారంలో ఆటోమేగిగ్గా పై తరగతులు వెళ్లిపోతారు. సరిగ్గా పరీక్షల సమయంలో కరోన వైరస్ ఉధృతరూపంతో దాల్చడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది.