ఆర్టీసీకి అంత బాకీ లేం..  ప్రభుత్వం  - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీకి అంత బాకీ లేం..  ప్రభుత్వం 

October 29, 2019

Telangana.....

తెలంగాణ ఆర్టీసీ అప్పులు వ్యవహారం తికమకగా మారింది. ప్రభుత్వం నుంచి సంస్థకు దాదాపు రూ. 5 వేలకోట్ల బకాయిలు రావాలని కార్మిక సంఘాలు చెబుతుండగా, అదంతా అబద్ధమని, అంత అప్పు లేమని ప్రభుత్వం అంటోంది. ఈమేరకు మంగళవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. 

ఆర్టీసీకి తాము సంబంధించి రూ. 1099 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం వివరించింది. ఆ మొత్తం కూడా టికెట్లపై రాయితీకి సంబంధించినందని, వాస్తవానికి తాము ఎలాంటి అప్పూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ 58 శాతం,  తెలంగాణ 42 శాతం చెల్లించాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ ఆస్తుల పంపకం జరగలేదు’ అని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ చెప్పారు. ఎందుకు పంచుకోలేదని కోర్టు అడగ్గా, అది కోర్టు పరిధిలో ఉందని అన్నారు. ఆయన వాదనల తర్వాత కార్మిక సంఘాల న్యాయవాది వాదించనున్నారు.