తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో దసరా సెలవులు పొడిగింపు!

October 9, 2019

Telangana .....

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 

విద్యాసంస్థల దసరా సెలవులు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. అయితే సెలవులను మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి ఆ బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించనున్నట్లు సమాచారం.