ఆర్టీసీ సమ్మె..సుప్రీం జడ్జిల కమిటీ అవసరం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె..సుప్రీం జడ్జిల కమిటీ అవసరం లేదు

November 13, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40వ రోజుకి చేరింది. ఈ రోజు కూడా ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, కార్మికులు వెనక్కి తగ్గడకపోవడంతో సమస్య పరిష్కారం కోసం ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ జడ్జీలతో కమిటీ వేస్తామని, దీనిపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని మంగళవారం అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Telangana.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ జడ్జీల కమిటీ ప్రతిపాదనకు ప్రభుత్వం నో చెప్పింది. ఆర్టీసీ సమ్మె అంశం లేబర్‌ కోర్టులో ఉండడం వల్ల కమిటీ అవసరం లేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై చట్ట ప్రకారం లేబర్‌ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 1947 పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టం ప్రకారం కార్మికులంతా కంపెనీ చట్టాలను లోబడి ఉండాలని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ కార్మికులు ఎవరి ఆదేశాలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.