సింగం చెరువు తండా.. అప్పుడు..ఇప్పుడు.. కేటీఆర్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

సింగం చెరువు తండా.. అప్పుడు..ఇప్పుడు.. కేటీఆర్ ట్వీట్

April 7, 2018

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఒకటి. ఇప్పటికే చాలా ప్ర్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం కిందికి వచ్చే నాచారంలోని సింగం చెరువు తండాలో 176 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.ఈ తండా గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో తెలిపే ఫొటోలను ఆయన ట్వీటర్లో పోస్ట్ చేశారు. వీధులు, పాత ఇళ్లు, కాలవల స్థానంలో కొత్త ఇళ్లు, పార్కు, ఆటస్థలం వంటి సకల సదుపాయాలతో కూడిన ఇళ్లే లేచాయి. రూ. 13.64 కోట్ల వ్యయంతో 11 బ్లాకుల్లో 176 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను ఇక్కడ నిర్మించారు. ఒక్కో ఇంటి విస్తార్ణం 560 చ‌ద‌ర‌పు అడుగులు. ఒక్కో ఇంట్లో రెండు పడగ్గదులు, కిచెన్‌, హాలు రెండు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ,  కంపోస్టింగ్ గుంత‌లను కూడా ఏర్పాటు చేశారు. నాచారం మెయిన్ రోడ్డు నుంచి కాల‌నీ వ‌ర‌కు సీసీ రోడ్డు కూడా వేశారు.