Telangana Government Special CL to Women Employees on the eve of Women’s Day
mictv telugu

Special Holiday: మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

March 6, 2023

Telangana Government Special CL to Women Employees on the eve of Women’s Day

రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి 8న రాష్ట్ర సర్కార్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తోంది. ఈ సారి కూడా అలాగే సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8న హోలీ పండుగ వేళ విద్యాసంస్ధలకు సెలవు ప్రకటిస్తూ ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ రోజు ఉమెన్స్ డే ఉండటంతో.. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది.