ఈసారి ప్రగతి భవన్‌లోనే పంద్రాగస్టు పండుగ! - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి ప్రగతి భవన్‌లోనే పంద్రాగస్టు పండుగ!

August 13, 2020

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈసారి మాత్రం ఈ వేడులు సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 

జిల్లా స్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి ఏయే జిల్లాల్లో ఎవరు జెండాను ఆవిష్కరించేదీ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్ పర్సన్లు, మునిసిపల్ చైర్‌పర్సన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.