Home > విద్య & ఉద్యోగాలు > నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా.. గ్రూప్-2, 3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో 1298 పోస్టులు మంజూరు చేసిన అనంతరం.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతులు ఇవ్వనుంది. ఇటీవల ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గ్రూప్-4 నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. గ్రూప్-4 కేటగిరీలో 9168 పోస్టులు ఉండగా.. వాటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. 9168 పోస్టుల్లో కొన్ని కొత్త పోస్టులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాల్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది.

ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో 1298 కొత్త పోస్టులకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆమోదం లభించిన వెంటనే కొత్త పోస్టులను మంజూరు చేయనున్నారు. అనంతరం గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇవ్వనుంది. సర్కార్ అనుమతి తర్వాత ఆయా శాఖల నుంచి అవసరమైన వివరాలను తీసుకొని గ్రూప్-4 పోస్టుల భర్తీ ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష, ఫలితాలతో పాటు గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీ షెడ్యూల్ ను పరిగణలోకి తీసుకొని గ్రూప్-4 నియామక షెడ్యూల్ ప్రకటిస్తారు.

Updated : 22 Nov 2022 9:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top