తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. వాళ్ల ధాన్యం కొనం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. వాళ్ల ధాన్యం కొనం

April 13, 2022

ddddd

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌లో కేవ‌లం తెలంగాణ‌కు చెందిన రైతుల ధాన్యాన్ని మాత్ర‌మే కొంటామ‌ని, ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన రైతుల ధాన్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొనేది లేద‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు బుధవారం మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కాసేప‌టి క్రితం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో గంగుల మాట్లాడుతూ..’తెలంగాణ‌లో ధాన్యం కొనుగోళ్ల‌లో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ధాన్యం రాకుండా అడ్డుకుంటాం. ఇందుకోసం తెలంగాణ న‌లుదిక్కులా 51 చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ాం. అంతేకాకుండా ప్ర‌తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ అధికారిని నియ‌మిస్తాం. ధాన్యం కొనుగోళ్ల‌లో తెలంగాణ రైతుల ఆధార్ కార్డుల ప‌రిశీలించిన త‌ర్వాతే, ముందుకు సాగుతాం” అని ఆయ‌న అన్నారు.

మరోపక్క మంగళవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు. ‘వడ్ల కొనుగోలుపై చీఫ్ సెక్రటరీ తదితరులతో ఒక కమిటీ వేశాం. తక్కువ నష్టంతో ధాన్యం మొత్తం కొనుగోలు చస్తాం. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. గోనె సంచులు వంటి సదుపాయాలన్నీ పౌర సరఫరాలశాఖ కల్పిస్తుంది. మూడు నాలుగు రోజుల్లో మొత్తం కొంటారు. రైతులు ఒక్క గింజ కూడా తక్కువకు అమ్మొద్దు. మద్దతు ధర 1960 రూపాయాలు మేం చెల్లిస్తాం. రాష్ట్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది.. రాష్ట్రంలో వ్యవసాయం కళకళలాడుతోంది..’ అని కేసీఆర్ అన్నారు.