Telangana governor tamilisai soundarajan slams state government over universities recruitment board bill
mictv telugu

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. తమిళిసై కన్నెర్ర

November 9, 2022

Telangana governor tamilisai soundarajan slams state government over universities recruitment board bill

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు తనపై కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకెంతో బాధగా ఉందని ఆయన చెప్పారు. తమిళిసై విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ‘‘యూనివర్సిటీల్లో టీచర్ల బిల్లుపై స్పష్టత కావాలని కోరాను.  తర్వాత నేనే వివరంగా నివేదిక రూపొందించాను. కానీ నేనేదో ఆ బిల్లును తొక్కిపెడుతున్నట్లు పెడార్థాలు తీశారు. నిజం చెబుతున్నా. నేను బిల్లూ తొక్కిపెట్టడం లేదు’ అని చెప్పారు.

8 ఏళ్లుగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీచేయడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘నియామకాల బోర్డు ఎందుకు అవసరమో చెప్పాలి. ఎలాంటి ప్రొటోకాల్ పాటిస్తారో తెలిపారి. నియామకాల బోర్డుతో ఎలాంటి ఇబ్బంది వస్తాయి? అది యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంవా? న్యాయ వివాదాలు వస్తే ఎలా పరిష్కరించుకుంటారు? ఈ ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి. కానీ ప్రభుత్వం చెప్పడం లేదు. చర్చిద్దాం రమ్మని మంత్రిని(సబితా ఇంద్రారెడ్డిని) పిలిస్తే సమాచారం రాలేదని అంటున్నారు’ అని గవర్నర్ ఆక్షేపించారు. కొందరు తనకు వ్యతిరేకంగా రాజ్ భవన్ ముందు ఆందోళన చేస్తామంటున్నారని, తనకు వారితో చర్చలకు రెడీ అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసులోనూ తనను లాగడానికి ప్రయత్నించారని, ఇది సరికాదని అన్నారు. ‘నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమానంగా ఉంది. హౌస్ కేసులో తుషార్ అనే వ్యక్తి పేరు వచ్చినందుకు రాజ్ భవన్ ను లాగారు. తుషార్ గతంలో నా దగ్గర ఏడీసీగా పనిచేసిన మాట నిజమే. అంత మాత్రానికే రాజ్ భవన్‌పై ఆరోపణ చేయడం సరికాదు. నాతో ఎవరైనా మాట్లాడొచ్చు. రాజ్‌భవన్ ప్రగతి భవన్ లాంటిది కాదు..’ అని అన్నారు.