Telangana Governor Tamilisai Soundararajan performed the first pooja to Khairatabad Mahaganapati
mictv telugu

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశుడు.. గవర్నర్‌ తొలిపూజ

August 31, 2022

ఖైరతాబాద్ ‘మహా గణపతి’ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. గణనాథుడిని దర్శించుకునేందుకు నేటి నుంచే భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ‘పంచముఖ లక్ష్మీగణపతి’గా దర్శనం ఇవ్వనున్నాడు. బడా గణేశుడికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలి పూజ చేశారు. ఈ ఏడాది ‘పంచముఖ మహాలక్ష్మి గణపతి’గా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.

ఈసారి 50 అడుగులతో ఏర్పాటు చేసిన బడా గణేశ్‌ను మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహాగాయత్రిదేవీ కొలువుదీరారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తు్న్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.