శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై

October 23, 2019

Telangana Governor .

తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఈరోజు ఉదయం ప్రారంభ వీఐపీ సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్‌ ఆ తర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. 

ఆమెకు టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి తిరుమలేశుని ఫోటోను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ…తాను శ్రీవారి భక్తురాలినని, స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో వసతి సదుపాయాలు, నిర్వాహణను ప్రశంసించారు.