Telangana Governor wished CM KCR on his birthday
mictv telugu

సీఎం కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన గవర్నర్

February 17, 2023

తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సీఎం కేసీఆర్ కి బర్త్‌డే విషెష్ చెప్పారు. కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వానికి మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ సైతం ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడం.. అందుకు బీఆర్ఎస్ మంత్రులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు వేయడం జరిగింది.

ఈ మధ్య అసెంబ్లీ బడ్జెట్ విషయంలో గవర్నర్ ప్రసంగంపై కోర్ట్ మెట్లుకూడా ఎక్కేంతవరకూ వెళ్ళింది వీరి వివాదం. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని అప్పట్లో సూచించారు తమిళిసై. అన్ని సద్దుమణిగినట్లు ఈ నెల 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు వచ్చిన గవర్నర్‌ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

 

ఇవాళ కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా గ్రీటింగ్స్ తెలిపారు. కాగా గత పుట్టినరోజుకు సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపారు.