తెలంగాణ గవర్నర్ తండ్రి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ గవర్నర్ తండ్రి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి.. 

September 25, 2019

Telangana Governor’s father in race for Congress ticket for tamilanadu bypoll

కొత్తగా నియమితులైన తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ బీజేపీ పార్టీలో ఉండగా ఆమె తండ్రి కుమారి అనంతన్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. 86 ఏళ్ళ అనంతన్ తమిళనాడులో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తిరునల్‌వేలి జిల్లా నంగునేరి స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అనంతన్‌ గతంలో టీఎన్‌పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

పొత్తులో భాగంగా డీఎంకే ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించింది. అనంతన్‌ సోదరుడు, నంగునేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వసంత కుమార్‌ 2019 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరుగన్నుంది. ఈయన అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ టీఎన్‌పీసీసీ అధ్యక్షుడు అళగిరి కూడ అనంతన్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తమిళనాడులోని నంగునేరి, విక్రవాండి స్థానాలకు అక్టోబర్‌ 21న ఉపఎన్నిక జరగనుంది.