తెలంగాణలోని యూనివర్శిటీల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15 యూనివర్సిటీల్లో ఇకపై టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాల ప్రక్రియను ఈ బోర్డు ద్వారా చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వుల జారీ చేసింది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ వ్యవహరించనున్నారు. బోర్డు కన్వీనర్‌గా కళాశాల విద్యాశాఖ కమిషనర్, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు కొనసాగనున్నారు. ఈ మేరకు నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది.
వర్సిటీల్లోని 3,500 ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి బోర్డు ప్రక్రియ ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియకోసం వేచి చూస్తున్నారు. ఒక్కో యూనివర్సిటీలో వేర్వేరుగా నియామకాలు చేపడితే.. కొన్నింటిలో ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఒకే అభ్యర్థి వివిధ యూనివర్సిటీలకు పోటీపడుతున్నారు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మిగిలినవి వదిలేస్తున్నారన్న అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. బిహార్ తదితర రాష్ట్రాల్లో నియామకాలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించిన తర్వాత తెలంగాణలో కూడా నియామకాలకు సంబంధించి కామన్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.