telangana Govt de-recognition of banjara hills DAV school
mictv telugu

బంజారా హిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు.. పిల్లలను ఏం చేస్తారంటే

October 21, 2022

 

హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించి సీరియస్ చర్యలు తీసుకుంది. డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేసింది. ఈ మేరకు డీఈవో రోహిణి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్కూలు ప్రిన్సిపల్, అతని డ్రైవరుపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండుకు తరలించారు. అటు బాధితులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఇలాంటి ఘటనలు పనరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తీసుకోవాల్సిన చర్యలు సూచించేందుకు విద్యాశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వారం రోజుల్లో నివేదిక వస్తుందని, దాని ఆధారంగా విద్యార్ధుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పాఠశాల గుర్తింపు రద్దు చేసినందున విద్యార్ధులను వేరే స్కూళ్లలో సర్దుబాటు చేయాలని డీఈవోను ఆదేశించారు. ఈ వ్యవహారంలో పేరెంట్స్ సందేహాలన నివృత్తి చేసేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.