Telangana Govt declared holiday on 7th September
mictv telugu

శుక్రవారం సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే

September 7, 2022

వినాయక నవరాత్రులు ముగింపుకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం భారీ ఎత్తున వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నందున ఆ రోజు సెలవు ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాలకు ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించింది. ఆ రోజున ట్రాఫిక్ ఆంక్షలతో విద్యార్ధులు, ఉద్యోగులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చూడడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇప్పటివరకు ఖైరతాబాద్ గణేశుడిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయగా, సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సారి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ట్యాంక్ బండ్‌పై క్రేన్లను ఏర్పాటు చేస్తోంది.