Telangana Govt declared holiday on September 17
mictv telugu

బ్రేకింగ్.. రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

September 16, 2022

Telangana Govt declared holiday on September 17

రేపు సెప్టెంబర్ 17న తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైన సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. శుక్ర, శని, ఆది వారాలలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెలవును ప్రకటించారు. అటు బీజేపీ సైతం శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో విమోచనా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందల మంది కళాకారులు ఇప్పటికే చేరుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇటు మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ పాతబస్తీలో తిరంగా యాత్ర చేపట్టారు.