Telangana Govt formed SIT in TRS MLA purchase case
mictv telugu

ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

November 9, 2022

Telangana Govt formed SIT in TRS MLA purchase case

మొయినాబాద్ ఫాంహౌస్‌‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసును దర్యాప్తు చేయడానికి బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

సిట్‌‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారని అందులో పేర్కొన్నారు. ఈ బృందంలో నల్గొండ ఎస్పీ రమా రాజేశ్వరి, నారాయణ పేట ఎస్పీ వెంకటేళ్వర్లు, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌‌హెచ్‌‌వో లక్ష్మీరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ కేసులో దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసి దర్యాప్తు చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.