Telangana Govt into gravel business
mictv telugu

లాభసాటి వ్యాపారంలోకి తెలంగాణ ప్రభుత్వం.. ధరలు తగ్గే అవకాశం

August 22, 2022

తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యాపారంలోకి దిగుతోంది. ఇప్పటివరకు ఇసుక క్రయ విక్రయాలు, సేకరణకు పరిమితమైన తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇక నుంచి కంకర, రాతి ఇసుక వ్యాపారం చేయనుంది. కొండలు, గుట్టలను తవ్వి కంకర, రాతి ఇసుకగా మార్చేందుకు ప్రణాళిక రచించింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 266 హెక్టార్లు, దండు మైలారంలో 191 హెక్టార్లు, బండ రావిర్యాలలో 26 హెక్టార్లు, చిన్న రావిర్యాలలో 2.91 హెక్టార్ల భూమిని గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 1200 ఎకరాల భూమిలో మైనింగ్ చేపట్టేందుకు సమాయాత్తమవుతోంది. అందులో 700 ఎకరాల భూమి గుట్టలు, కొండలతో నిండి ఉంది. ఇందులో భాగంగా మొదట యాచారంలో 39 ఎకరాల్లో మైనింగ్ చేపడతారు. ఇక్కడ నుంచి ఏటా 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల కంకర వెలికితీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థలే ఈ వ్యాపారం చేస్తుండగా, ప్రభుత్వ సంస్థ దిగుతుండడంతో ధరలు తగ్గుతాయని భవన నిర్మాణ కంపెనీలు భావిస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదుల నుంచి ఇసుకను తరలించడం భారీ వ్యయంతో కూడుకున్న పని కావడంతో పాటు ధర కూడా తడిసి మోపెడవుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ నిర్మాణాల్లో రాతి ఇసుకను వినియోగిస్తున్నాయి. దీంతో ధర తగ్గడంతో పాటు రాతి ఇసుకకు డిమాండ్ పెరిగింది.