తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే 94 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టింది. జిల్లాల కలెక్టర్‌లతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శులు కూడా బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి హోళికేరిని నియమించారు. హనుమకొండ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌ను, రాజీవ్ గాంధీ హనుమంతును నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌ను హన్మకొండ కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్ కుమార్‌ను మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా నియమించడంతో పాటు హైదరాబాద్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా జి.రవి, కుమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా యాస్మిన్ బాషా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎస్.హరీశ్, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా ఎస్.వెంకటరావు, మంచిర్యాల కలెక్టర్‌గా బి సంతోష్, మెదక్ కలెక్టర్‌గా రాజశ్రీ షా, జగిత్యాల కలెక్టర్‌గా కర్ణణ్ ను నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది నవంబరులో కూడా తెలంగాణ ప్రభుత్వం 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అందులో జోగులాంబ గద్వాల జిల్లాకు అపూర్వ చౌహాన్, వరంగల్‌కు అశ్విని తానాజీ, మంచిర్యాల జిల్లాకు బి.రాహుల్, నారాయణపేటకు మయాంక్ మిట్టల్, జగిత్యాలకు మందా మకరందు, జనగామకు ప్రఫుల్ దేశాయ్, మేడ్చల్ జిల్లాకు అభిషేక్ అగస్త్య, నల్గొండ జిల్లాకు కుష్బూ గుప్తా, వికారాబాద్‌కు రాహుల్ శర్మ నియమితులయ్యారు.