ప్రభుత్వానికి చేరిన హైకోర్టు ఆర్డర్ కాపీ..కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వానికి చేరిన హైకోర్టు ఆర్డర్ కాపీ..కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ

October 22, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకి చేరింది. సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి చేరింది. ఆర్డర్ కాపీ అందిందనే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. 

Telangana govt...

దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ స్పందించారు. ఆర్డర్‌లో ఏముందనే విషయంపై అధ్యయనం చేసి వెంటనే నివేదిక తయారు చేయాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధాన సలహారుడు రాజీవ్ శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ముఖ్య అధికారులతో ప్రగతి భవన్‌లో రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం 3 గంటలకు కోర్టు తీర్పు, ఇతర అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అనంతరం ఆర్టీసీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్మికులు, సామాన్య ప్రజలు కేసీఆర్ ప్రకటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.