స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఇక నుంచి స్నాక్స్ అందజేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని 1.89 లక్షల మంది విద్యార్థులకు స్నాక్స్ కోసం రూ. 9.67 కోట్ల నిధులను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి స్పెషల్ క్లాసులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రోజూ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీటిని నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అయితే సాయంత్రం ఆకలి వేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. దదీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి స్పాక్స్ ఇవ్వనున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 15 విలువైన స్నాక్స్ ను మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా అందజేస్తారు.
పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయి.