తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై క్లారిటీ వచ్చేసింది. సీజే ధర్మాసనం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ తరఫు న్యాయవాదులు దుష్యంత్ దవే, ఆశోక్ ఆనంద్‌లు జరిపిన చర్చలు ఫలించాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సర్కార్ ఉప సంహరించుకుంది. అసెంబ్లీ సమావేశాలు నిబంధనల మేరకే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని న్యాయవాదులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడం లేదంటూ, ఆమె తీరును నిరసిస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి మూడో తేదీన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి కూడా అదే తరహాలో ప్రవేశపెట్టాలని భావించింది. అయితే కేసీఆర్ సర్కార్‌కు ఊహించని షాక్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో కోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించి..మళ్లీ వెనక్కు తగ్గింది.
ఇవి కూడా చదవండి :
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి.. పల్లా
విద్యావ్యవస్థను బాగుచేయమంటే.. స్వేరోస్ సృష్టించి ఆగం పట్టించిండు..