జాబ్ నోటిఫికేషన్ల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గ్రూప్-2 నోటిఫికేషన్ను కాసేపటి క్రితం జారీ చేసింది. మొత్తం 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తులను జనవరి 18 నుంచి ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆఖరు తేది ఫిబ్రవరి 16. 80వేలకు పైగా కొలువులను భర్తీ చేస్తామన్న కేసీఆర్ హామీ ప్రకారం ప్రభుత్వం తరచూ నోటిఫికేస్లు వదులుతున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. పోలీసు ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు చేసుకోవాలి. రాతపరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టులు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సర్వీస్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలు), డ్రిస్టిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (బాలనేరస్తుల జైళ్లు), అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ట్రైబల్ వెల్ఫేర్ సబ్ సర్వీస్), అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఎస్సీడీడీ సబ్ సర్వీస్) వంటివి