స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ సత్తా.. ముచ్చటగా మూడోసారి  - MicTv.in - Telugu News
mictv telugu

స్వచ్ఛ భారత్‌లో తెలంగాణ సత్తా.. ముచ్చటగా మూడోసారి 

September 30, 2020

mfv

స్వచ్ఛ భారత్‌లోమిషన్‌లో తెలంగాణ సత్తా చాటుతూనే ఉంది. ఎప్పటిలాగే మరోసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ నివేధికను తాజాగా ప్రకటించింది. దీంతో స్వచ్ఛతను పాటిస్తూ మూడోసారి స్వచ్ఛ భారత్ అవార్డులను దక్కించుకుంది. చెత్త సేకరణ, వ్యర్థాలను తొలగించడం, గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచడంలో మంచి ఫలితాలు సాధించడంతో తెలంగాణను నంబర్ వన్‌గా ప్రకటించారు. 

ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్ లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందజేస్తోంది. చెత్త సేకరణ, స్వచ్ఛత వంటి అంశాల్లో వీటిని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా తెలంగాణ అవార్డును దక్కించుకుంది. జిల్లాల క్యాటగిరీలో కరీంనగర్‌ మూడోస్థానంలో నిలిచింది. అక్టోబరు 2వ తేదీన స్వచ్ఛభారత్‌ దివస్‌ను పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దీన్ని సమర్థంగా అమలుచేసి అవార్డులు రావడానికి కారకులైన వారందరికీ స్వచ్ఛ భారత్ మిషన్ అభినందనలు తెలిపింది.