పెట్టుకోవాలా? వద్దా? ఇక మీ ఇష్టం - MicTv.in - Telugu News
mictv telugu

పెట్టుకోవాలా? వద్దా? ఇక మీ ఇష్టం

April 1, 2022

11

దేశంలో కరోనా ప్రభావం క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు. కేంద్రం ఆదేశానుసారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. రెండేళ్లుగా కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, మాస్కు ధరించడం అందరికీ అసౌకర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇకపై మాస్కు ధరించడం వ్యక్తుల ఇష్టాలకు వదిలేస్తున్నామని తెలిపారు. దీర్ఘ కాలిక వ్యాధులు, వృద్ధులు మాత్రం మాస్కు వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 కేసులు నమోదవుతుండగా, వాటిలో 20 కేసులు హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాయి. దాదాపు 20 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అయితే జన సమూహంలో ఉన్నప్పుడు మాస్కు ధరించడం మంచి సాంప్రదాయంగా అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో ఇప్పుడు ప్రబలుతున్న కరోనా వేరియంట్లతో మనం భయపడాల్సిన అవసరం లేదని, మనకొచ్చి పోయిన వేరియంట్లే ఇప్పుడు అక్కడ విజృంభిస్తున్నాయని స్పష్టం చేశారు.