తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. కొన్నాళ్ల కిందట క్షుద్రపూజల్లో పాల్గొని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి కలకలం రేపిన శ్రీనివాస్ తాజాగా కరోనాపై దిమ్మతిరిగే వ్యాఖ్యలు చేశారు. ‘‘క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందింది. ఏసుక్రీస్తు కృప, మహిమ వల్లే కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టింది. క్రైస్తవమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పింది. మంచిని ప్రేమించాలి, గౌరవించాలి. ’’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం సందర్భంగా ఆయన కేసీఆర్ కాళ్లకు మొక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి టికెట్ కోసం ఆయన ఇలా చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.