వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్.. ఏం చేశారంటే? - MicTv.in - Telugu News
mictv telugu

వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్.. ఏం చేశారంటే?

April 6, 2022

 

vbg

తెలంగాణ వ్యాప్తంగా హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ తెలియని వారుండరు. ఎందుకుంటే కరోనా వైరస్ గాలి ద్వారా వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులను పెట్టుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్లను వాడండి అంటూ అనేకసార్లు మీడియా సమావేశంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు. ఇటీవలే తెలంగాణలో కరోనా థర్డ్‌ వేవ్ ముగిసిపోయింది. మాస్కులు పెట్టుకోవటం, పెట్టుకోకపోవటం ప్రజల ఇష్టమని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని నియమాలు చెప్పినా డైరెక్ట‌ర్ శ్రీనివాస్ ప్రస్తుతం పెను వివాదంలో చిక్కుకున్నారు. కొత్త‌గూడెంలో క్షుద్ర పూజ‌లు చేశారని కొందరు, డెరెక్టర్ శ్రీనివాస్ విచిత్ర పూజలు చేస్తూ కనిపించారని మరికొందరు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే… ప్ర‌భుత్వ అధికారిగా, అది కూడా వైద్యశాఖ డైరెక్ట‌ర్‌గా, సైన్స్‌ను బోధించాల్సిన శ్రీనివాస్.. క్షుద్ర, విచిత్ర పూజ‌లు చేయడం ఏంటీ? అని ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. ఏంటీ డాక్టర్ చదువుకున్నా ఆయన ఇలా పూజ‌లు చేస్తాడా? ఇలాంటివి వారు నమ్మరు కదా? ఎలా చేస్తున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరోపక్క కొత్తగూడెం, ఖ‌మ్మం ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న శ్రీనివాస్.. దేవుడు క‌రుణిస్తాడ‌ని చెబుతూ విచిత్ర పూజ‌లు చేశారు. అంతేకాకుండా ఖ‌మ్మంలో త‌న‌ను తాను దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయ‌న ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ ప్రస్తుతం మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. అంతేకాకుండా రాజకీయ రంగ ప్ర‌వేశం కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర, విచిత్ర పూజ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.