Telangana: Heavy rains today and tomorrow
mictv telugu

తెలంగాణ: ఇవాళ, రేపు భారీ వర్షాలు

July 28, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆవర్తనం ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశకు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో గురువారం, శుక్రవారం మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరాలను వెల్లడించారు.

” గురువారం, శుక్రవారం రోజుల్లో.. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్ది పేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో, శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది” అని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.