Telangana: Heavy rains today..in this district
mictv telugu

తెలంగాణ: నేడు భారీ వర్షాలు..ఈ జిల్లాలోనే

July 22, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. దీంతో రోడ్లన్నీ వరద నీళ్లతో నిండిపోయాయి. పలు కాలనీల్లో వరదనీరు భారీగా వచ్చి చేరడంతో డ్రైనేజీలు లీక్ అయ్యాయి. వర్షం కారణంగా హైదరాబాద్‌లో వాహనదారులు, చిరుద్యోగులు, వ్యాపారాస్థులు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, నేడు ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయో తెలియజేస్తూ, అందుకు సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసింది.

”తెలంగాణలో హైదాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాలు ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వానలు కురుస్తాయి” అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.