సోమవారం వరకు ఆగండి..సీఎం కేసీఆర్‌తో హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

సోమవారం వరకు ఆగండి..సీఎం కేసీఆర్‌తో హైకోర్టు

November 8, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 34వ రోజుకి చేరింది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకపోతే మిగతా 5,100 రూట్లను కూడా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రవాణాశాఖ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనిపై ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు అనే వ్యక్తి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 

Telangana high court ..

5,100 రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయం తీసుకునందున.. కేబినెట్ ప్రొసీడింగ్స్‌ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు, అప్పటి వరకు రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై హైకోర్టు ఏం చెబుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.