Telangana High Court Canceled Cs Somesh Kumar Telangana Ias Cadre
mictv telugu

తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు..

January 10, 2023

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ క్యాడర్‌ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ సెక్ర‌ట‌రీగా తెలంగాణ‌లో సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ.. సొంత క్యాడర్ ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ ఈ తీర్పు వెల్ల‌డించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్ ను సొంత రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది.

క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్.. తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. అయితే, సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును 3 వారాల పాటు కోర్టు నిలిపివేసింది. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు.