Telangana High Court cancels stay in TRS MLAs purchase case
mictv telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక అనుమతి

November 8, 2022

Telangana High Court cancels stay in TRS MLAs purchase case

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదంటూ దర్యాప్తుపై గతంలో విధించిన స్టేను ఉపసంహరించుకుంది.

అంతేకాక, మొయినా బాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే దర్యాప్తు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్‌‌‌లో కోరారు. దీనిపై వాదనలు జరుగుతున్నప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించింది. అనంతరం బీజేపీ నేత పిటిషన్‌‌పై స్పందించిన ధర్మాసనం.. ఈ విషయంపై లోతుగా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.