టీఆర్ఎస్‌కు హైకోర్టు షాక్.. పిటిషన్‌ కొట్టేసిత - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్‌కు హైకోర్టు షాక్.. పిటిషన్‌ కొట్టేసిత

October 18, 2022

telangana High court dismissed the petition filed by TRS

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయితాజాగా హైకోర్టులో టీఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జ్యోకం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. మునుగోడు స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని ఎన్నికల కమిషన్‌ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. టీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

కారును పోలీన 8 గుర్తులు తొలగించాలని టీఆర్ఎస్ ఆ పిటిషన్లో పేర్కొంది. గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి టీఆర్ఎస్ వివరించింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ అంటోంది.