కొత్త అసెంబ్లీ కట్టొద్దు, ఎర్రమంజిల్ కూల్చొద్దు.. హైకోర్టు  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త అసెంబ్లీ కట్టొద్దు, ఎర్రమంజిల్ కూల్చొద్దు.. హైకోర్టు 

September 16, 2019

Telangana high court dismisses new assembly construction proposal 

కొత్త అసెంబ్లీ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీని కట్టాలన్న కేబినెట్ ప్రతిపాదనను  సోమవారం హైకోర్టు కొట్టేసింది. ఎర్రమంజిల్‌లోని అసెంబ్లీ భవనం నిర్మించకూడదని, అక్కడి పురాతన భవనాలను కూడా కూల్చకూడదని కోర్టు ఆదేశించింది. కొత్త నిర్మాణం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న పిటిషనర్ల వాదన సరైందేనని అభిప్రాయపడింది.  కేబినెట్ నిర్ణయం చట్టపరిధిలో లేదని పేర్కొంది. 

ప్రస్తుత అసెంబ్లీ పాతబడిందని, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యే అసెంబ్లీ కావాలని సీఎం కేసీఆర్ సంకల్పించడం తెలిసిందే. దీని కోసం ఎర్రమంజిల్‌లోని16 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. కొత్త అసెంబ్లీ నిర్మాణ పనులకు ఆయన  జూన్ 27న శంకుస్థాపన కూడా చేశారు. హైకోర్టు తీర్పుతో కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.