తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ఐఏఎస్‌లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

October 24, 2019

Telangana  .....

తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతోంది. జనవరిలో 85గా ఉన్న డెంగీ కేసులు.. అక్టోబర్ నాటికి 3,800కి పెరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఐఏఎస్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగీ గురించి వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేందర్‌ కుమార్‌ జోషి సహా మున్సిపల్‌ శాఖ కార్యదర్శి ఈరోజు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి వివరణపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నివారణ చర్యలు తీసుకుంటున్నట్లయితే డెంగీ కేసులు గణనీయంగా ఎలా పెరుగుతాయని ప్రశ్నించింది. 

మూసీ నదిని పక్కనున్న హైకోర్టులోనే దోమలున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. కోట్లు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే మీరు సామాన్య ప్రజలకు ఎం సేవ చేస్తున్నారని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను పాటిచకుంటే ఐఏఎస్‌లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామంది. అధికారుల నిర్లక్ష్యం వలన ఎవరైనా మరణిస్తే ఐఏఎస్‌లదే బాధ్యత అని తెలిపింది. డెంగీతో మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఐఏఎస్‌ల సొంత ఎకౌంట్ నుంచి చెల్లించాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దోమల నివారణకై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పేర్కొంది