మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

October 22, 2019

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని ఇటీవల హైకోర్టులో కొందరు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు వీటిపై విచారణ జరిపి వాటిని కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ఆగస్టు 15లోపే నిర్వహించాలని భావించింది. 

telangana high court.

కానీ, తెలంగాణలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నూతన వార్డుల విభజన, జనాభా ప్రక్రియపై ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కూడా పిటిషనర్లు తెలిపారు. దీంతో హైకోర్టు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై స్టే విధించింది. తాజాగా స్టే ఎత్తేస్తూ ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది.