Telangana high court grants bail to bjp former mla raja singh
mictv telugu

రాజాసింగ్‌కు బెయిల్.. షరతులు వర్తిస్తాయి…

November 9, 2022

Telangana high court grants bail to bjp former mla raja singh

మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు షరతులతో ఆయన ఉపశమనం కలిగించింది. పీడీ యాక్ట్ కేసు ఎదుర్కొంటున్న ఆయన దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఆయన బెయిల్ పిటిషన్‌ను మంగళవారం విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మతాలను కించపరచే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది. ర్యాలీలు చేయొద్దని, రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవద్దని పేర్కొంది. దీంతో ఆయన కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. రాజాసింగ్ రెండు నెలల కింద ఓ వీడియో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారని ముస్లింలు నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపారు. బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.