ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు ఓకే   - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు ఓకే  

November 22, 2019

Telangana high court green signals rtc routes privatization 

తెలంగాణ ఆర్టీసీ సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కార్మిక సంఘాలకు మరో దెబ్బ తగిలింది. ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. మోటారు వాహనాల చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఈ విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో తాము వేలు పెట్టబోమని పేర్కొంది. 

అంతేకాకుండా..  ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య చక్కని పోటీ ఉంటే లాభాలు సాధ్యమవుతాయని పునరుద్ఘాటించింది. రాష్ట్రంలోని 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశరరావు పిటిషన్ వేశాడరు. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్లు తీశారు.