సంచలన తీర్పు.. నలుగురు హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్లకు జైలు శిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

సంచలన తీర్పు.. నలుగురు హైదరాబాద్ పోలీస్ ఆఫీసర్లకు జైలు శిక్ష

June 6, 2022

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో జాయింట్ సీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని న్యాయస్థానం ఆదేశించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగాలు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన హైకోర్టు వీరికి 4 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.