తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకటించింది. 50ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను తప్పనిసరిగా పేర్కొనాలి. దరఖాస్తుదారుల వయస్సు జనవరి 11 ,2023 నాటికి 18ఏళ్ల నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి. కాగా రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమిలో సడలింపు ఉండనుంది.
https://tshc.gov.in/getRecruitDetails
అసక్తి ఉన్న అభ్యర్థులు అన్లైన్లో ఫిబ్రవరి 11, 2023 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ. 600, ఎస్సీ, ఎస్టీ, ఈ డబ్య్లూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయి. ఇక రాత పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19 వేల నుంచి 58వేల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్ చూడవచ్చు.
ALSO READ: తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కొడుకుపై ఆర్జీవీ కామెంట్స్