ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో విచారణ

November 27, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన సంగతి తెల్సిందే. గత రెండు రోజులుగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిపోల ముందు ధర్నా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ మాసం వేతనాల గురించి హైకోర్టులో విచారణ జరిగింది. వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే అధికారం ఆర్టీసీకి ఉందని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. 

Telangana high court rtc.

ఒక్కరోజు గైర్హాజరైనా 8 రోజుల వేతనం మినహాయించే అధికారం ఉందన్నారు. మరోవైపు పనిచేసిన సెప్టెంబర్‌ నెల వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. చేసిన పనికి వేతనం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వేతనాలపై కార్మిక న్యాయస్థానానికి వెళ్లాలని.. హైకోర్టుకు కాదని అదనపు ఏజీ సూచించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.