కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ఆరోగ్యంపై పిటిషన్.. హైకోర్టు ఆగ్రహం 

July 10, 2020

High Court

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చెప్పాలని ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ తీరును ధర్మాసనం తప్పుబట్టింది. దీన్ని అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. రాజకీయ గిమ్మిక్కుల కోసం కోర్టులను వాడుకోవద్దని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అంతగా కావాలనుకుంటే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సూచించారు.  

గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కనిపించడం లేదనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకునేందుకు జులై 8న మాండమస్ పిటిషన్ దాఖలైంది. సోషల్ మీడియాలో జరుగుతున్న కథనాలను వీటికి జోడించారు. కాబట్టి ప్రజలు సీఎం ఆరోగ్యం ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారని పిటిషనర్ తెలిపారు. ఆయన చివరిసారిగా  గత నెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి కార్యక్రమంలోనే కనిపించారని పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.