టెస్టులకు పైసలెందుకు వసూల్ చేస్తున్నారు?..ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న - MicTv.in - Telugu News
mictv telugu

టెస్టులకు పైసలెందుకు వసూల్ చేస్తున్నారు?..ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

April 3, 2020

telangana high court slams government over coronavirus test cost

రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల నిర్వహణకు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉచితంగా కరోనా పరీక్షలు చేయకుండా.. ఒక్కో టెస్టుకు రూ.4500 ఎందుకు వసూలు చేస్తున్నారని కోర్టు అడిగింది. దీనికి ఏప్రిల్ 8లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రంలో గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్‌, వరంగల్ లోని ఎంజీఎంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. సీసీఎంలో కరోనా వైరస్ పరీక్షలను చేయడానికి ఇటీవలే కేంద్రం అంగీకరించింది. దీంతో రాష్ట్రంలో మరో ఐదు ప్రయివేట్ ల్యాబ్‌ల్లోనూ కరోనా వైరస్ టెస్టుల నిర్వహణకు కేంద్రం అంగీకరించింది. ఇక తెలంగాణలో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. ఈరోజు ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 229కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11మంది కరోనా వైరస్ సోకి మరణించారు.